![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -641 లో... దీప, కార్తీక్ పెళ్లి రోజు అని కావాలనే వాళ్ళిద్దరిని ఒక చోట ఉండనివ్వకుండా జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. కార్తీక్ ని తీసుకొని జ్యోత్స్న గుడికి వెళ్తుంది. అక్కడ కార్తీక్ తన భర్త అని పూజారికి చెప్పి అర్చన చేయించుకోవాలని అనుకుంది కానీ పారిజాతం ఎంట్రీతో అది ఫెయిల్ అవుతుంది.
ఆ తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. జ్యోత్స్న పై అమ్మ బాగా ప్రేమ పెంచుకుంటుంది.. అందుకే జ్యోత్స్న ఏం చేసినా చెల్లుతుందని కార్తీక్ తో దీప అంటుంది. అది విన్న జ్యోత్స్న నా బలం ఏంటో.. బలహీనత ఏంటో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది.
కార్తీక్, దీప, పారిజాతం వాళ్ళ దగ్గరికి వచ్చి.. బావ నాకు నీరసంగా ఉంది.. హాస్పిటల్ కి వెళదాం పద బావ అని జ్యోత్స్న యాక్టింగ్ చేస్తుంది. నేను తీసుకొని వెళ్తాను పదా అని పారు అంటుంది. అయిన జ్యోత్స్న వినదు. నేను బావతోనే వెళ్తానని అంటుంది. ఏం చేయలేక కార్తీక్ సరే అంటాడు.
ఆ తర్వాత కార్ లో ఇద్దరు వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళాక బావ నీరసంగా ఉంది.. కొబ్బరి బొండం కావాలని అంటుంది. దాంతో కార్ ఆపి తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడే దీప ఫోన్ చేస్తుంది. మేడమ్ కి కొబ్బరి బొండం కావాలట అని కార్తీక్ అనగానే.. కొబ్బరి బొండం మొహానికి కొట్టి వచ్చేయ్ అని దీప అంటుంది. అప్పుడు కార్తీక్ ఫోన్ స్పీకర్ లో పెడతాడు. నాకు వినపడిందని జ్యోత్స్న అనగానే వినపడాలనే అన్నానని దీప అంటుంది. దీప, జ్యోత్స్న ఇద్దరు కాసేపు కౌంటర్ వేస్తూ మాట్లాడుకుంటారు.
ఆ తర్వాత దీప దగ్గరికి పారిజాతం వస్తుంది. జ్యోత్స్న తల నొప్పి తగ్గిందటనా అని అడుగుతుంది. అది తగ్గే నొప్పి కాదండి అని దీప అనగానే దాని నొప్పి ఎలా తగ్గించాలో నాకు తెలుసని పారిజాతం అంటుంది. ఆ తర్వాత మణికొండ హాస్పిటల్ కీ వెళ్ళు.. అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటూ కార్తీక్ ని తనతో పాటు తిప్పుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత పారిజాతానికి శివన్నారాయణ ఫోన్ చేసి ఎక్కడున్నారని అడుగుతాడు. జ్యోత్స్నకి నీరసంగా ఉందంటే కార్తీక్ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళాడు. నేను దీపని ఇంట్లో దింపి ఇంటికి వస్తున్నానని పారిజాతం చెప్తుంది.
జ్యోత్స్నకి ఏమైందని సుమిత్ర టెన్షన్ పడుతుంది. ఇదంతా కావాలనే జ్యోత్స్న చేస్తుందని దశరథ్ కి అర్థం అవుతుంది. మరొకవైపు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగమని చెప్తుంది జ్యోత్స్న. ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. కావాలా అని కార్తీక్ ని అడుగగా తనకి వద్దని అంటాడు. ఆ తర్వాత ఈ రోజు నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా బావ మన స్టోరీ క్లైమాక్స్ కి వచ్చిందని ఒక ఖాళీ ప్లేస్ లో కార్ ఆపమంటుంది. బావ నేను పెళ్లి రోజున నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా అని తన చేతిలో ఉన్నా తాళి చూపిస్తుంది జ్యోత్స్న. ఇది నా మెడలో కట్టు బావ.. నన్నే బహుమతిగా తీసుకో బావ అని జ్యోత్స్న అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |